మదనపల్లె టౌన్ : మదనపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైత్ర బిల్డర్స్ అధినేత రాటకొండ రవితేజ మాట్లాడారు. తన కంపెనీ తరఫున ఎవరినీ మోసం చేయలేదని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల కంపెనీ అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో నగదు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించుకుని బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. తమపై అసత్య ఆరోపణలు చేయవద్దని కోరారు. ఎవరికై నా సైట్ కావాలన్నా, డబ్బు కావాలన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ బయటకు వచ్చిన రవితేజపై స్థానికంగా ఉన్న పలువురు బాధితులు పరుష పదజాలంతో దూషించి ఘర్షణకు దిగారు. వన్ టౌన్ పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేసి పంపించారు.


