గురువులకే పరీక్ష ! | - | Sakshi
Sakshi News home page

గురువులకే పరీక్ష !

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

ఎస్‌ఎల్‌ఓలు

ఏమి చేస్తారంటే..

● సమ్మేటివ్‌–1కు ‘ఎస్‌ఎల్‌ఓ’ల

నియామకంపై టీచర్ల అసహనం

● మోడిఫికేషన్లు కూడా అసంబద్ధమే..

ఎస్‌ఎల్‌ఓ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌

మదనపల్లె సిటీ: పాఠశాల విద్యాశాఖ పదో తరగతి సమ్మేటివ్‌–1 పరీక్షల నిర్వహణలో తీసుకొచ్చిన సరికొత్త విధానం ఉపాధ్యాయులలో తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి కారణమవుతోంది. కేవలం అంతర్గత పరీక్షలైన సమ్మేటివ్‌కు కూడా బోర్డు పరీక్షల తరహాలో కఠిన నిబంధనలు పెట్టడం, ఒక మండలంలోని టీచర్లను మరో మండలానికి పర్యవేక్షణ కోసం కేటాయించడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ఎన్నికల గందరగోళం మధ్యే పరీక్షలు షురూ

నిజానికి ఒకవైపు స్థానిక ఎన్నికల విధులు ఉండటంతో.. ఈ సారి సమ్మేటివ్‌–1 పరీక్షలు వాయిదా పడతాయని ఉపాధ్యాయ లోకం భావించింది. కానీ, విద్యాశాఖ ఎలాంటి వాయిదా లేకుండా ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 9వ తేదీ (సోమవారం) నుంచి పరీక్షలను ప్రారంభించింది. ఈ ఎన్నికల విధుల ఒత్తిడి, గందరగోళం నడుస్తుండగానే.. పరీక్షల పర్యవేక్షణకు ‘స్కూల్‌ లెవల్‌ అబ్జర్వర్లను’ నియమిస్తూ ప్రభుత్వం ఆకస్మికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల పాలుకావాల్సి వస్తోంది.

ఎస్‌ఎల్‌ఓ విధానాన్నిరద్దు చేయాలని డిమాండ్‌

సొంత మండలంలోనే కాకుండా, కిలోమీటర్ల దూరంలో ఉండే పక్క మండలాలకు అబ్జర్వర్లుగా కేటాయించడంలో ఉన్న లాజిక్‌ ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల తీవ్ర ఒత్తిడి మరియు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేయడానికి సిద్ధమైంది. పక్క మండలాలకు కాకుండా.. అదే మండలంలోని ఇతర పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసే విధంగా ఉత్తర్వులను సవరించింది.

అయితే ప్రభుత్వ తాజా సవరణలను సైతం ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. దీనిపై వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ప్రత్యేకంగా స్పందిస్తూ.. ‘సమ్మేటివ్‌ పరీక్షల పరిశీలనకు ప్రవేశపెట్టిన ఎస్‌ఎల్‌ఓ విధానాన్ని ప్రభు త్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలి. పక్క మండలా లు కాకుండా అదే మండలంలోని ఇతర స్కూళ్లకు వెళ్లి తనిఖీలు చేయాలంటూ ప్రభుత్వం తెచ్చిన సవరణలు కూడా పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాల్ఙి అని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కూల్‌ లెవల్‌ అబ్జర్వేషన్‌ విధానంలో భాగంగా ఎస్‌ఎల్‌ఓలకు విద్యాశాఖ కఠినమైన రూల్స్‌ జారీ చేసింది.

భాషేతర టీచర్లతో పర్యవేక్షణ:

తెలుగు, హిందీ, ఇంగ్లీషు వంటి భాషా పరీక్షలకు పొరుగు మండలంలోని పాఠశాలల నుంచి భాషేతర స్కూల్‌ అసిస్టెంట్లను పర్యవేక్షణకు కేటాయించారు.

సమయపాలన, డ్యూటీలు:

పరీక్ష జరిగే రోజు ఉదయం 8.30 గంటలకే కేటాయించిన స్కూల్‌కు హాజరవ్వాలి. ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను పర్యవేక్షిస్తూ, కాపీయింగ్‌ను అడ్డుకోవాలి. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలు నమోదు చేయాలి. ఏవైనా సమస్యలుంటే వెంటనే హెచ్‌ఎం లేదా ఎంఈఓలకు నివేదించాలి.

పేపర్ల తనిఖీ, మార్కుల నమోదు:

పరీక్షలు ప్రారంభమైన 4వ రోజు నుండి జవాబు పత్రాలను పరిశీలించాలి. ప్రతి పరీక్ష తర్వాత 3 పనిదినాల్లో పాఠశాలల్లోనే మూల్యాంకనం పూర్తి చేయాలి, జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లరాదు. కనీసం 5 శాతం లేదా 5 జవాబు పత్రాలను స్వయంగా తనిఖీ చేసి, మార్కుల కేటాయింపులో తేడాలుంటే అధికారులకు చెప్పాలి. అనంతరం 7వ రోజులోపు మార్కులను లీప్‌ యాప్‌లో నమోదు చేయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement