దోమకాటుపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

దోమకాటుపై అప్రమత్తత అవసరం

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

సదుం: దోమకాటుతో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభుత్వ హాస్టల్స్‌ విద్యార్థులకు 270 మెడికేటెడ్‌ దోమతెరలు బుధవారం పంపిణీ చేశారు. దోమకాటుతో డెంగీ, మలేరియా, చికన్‌ గున్యా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌యూనిట్‌ అధికారి విద్యాసాగర్‌, సూపర్‌వైజరు నీలకంఠ, సీహెచ్‌ఓ రషీద్‌, శ్రావణి పాల్గొన్నారు.

13 నుంచి రాష్ట్ర స్థాయి

నెట్‌బాల్‌ పోటీలు

మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలలో ఈనెల 13 నుంచి 70వ రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాల,బాలికల నెట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీలు రమేష్‌బాబు, జయా క్రిస్టీ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగరాజు, నరేష్‌బాబు తెలిపారు. ఈ పోటీలు 15 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్ర బాల, బాలికల నెట్‌బాల్‌ జట్టుకు ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు హాజరుకానున్ననట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో

మార్గదర్శకాలు పాటించండి

– కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

సాక్షి, మదనపల్లె: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను కమిషన్‌ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్‌–1 అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అధికారుల పాత్ర, బాధ్యతలు, విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ సందర్భాల్లో అవసరమైన చోట వీడియో రికార్డింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి అమర్నాథరెడ్డి, డీఈవో సుబ్రమణ్యం, డిఎల్డిఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

జెడ్పీ భవనం పరిశీలన: జెడ్పీ కార్యాలయాన్ని ప్రస్తుత భవనం నుంచి నూతన భవనంలోకి మార్చే ఏర్పాట్లను కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. బీటీ కళాశాల వెనుక పాత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ భవనాన్ని మరమ్మతులు చేసి, జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంగా వినియోగించేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు. కార్యాలయ గదులు, చైర్మన్‌ చాంబర్‌ పనులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement