భర్త వేధింపులతో మనస్తాపం.. వివాహిత ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో మనస్తాపం.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

మదనపల్లె టౌన్‌ : భర్త తమను పట్టించుకోకుండా మరో మహిళతో చనువుగా ఉంటున్నాడన్న ఆవేదనతో ఓ వివాహిత కత్తితో గొంతులో పొడుచుకుని, ఆపై హెయిర్‌ డై (వాస్మోల్‌) తాగి ఆత్మహత్యకు యత్నించింది. బుధవారం మదనపల్లె పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక చంద్ర కాలనీలో నివాసముంటున్న సాయికుమార్‌, నాగేశ్వరి (22) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సాయికుమార్‌ భార్యాపిల్లల బాగోగులు పట్టించుకోకుండా మరో మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఇదే విషయంపై నాగేశ్వరి భర్తను నిలదీయగా, అతను ఆమైపె దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగేశ్వరి ఇంట్లో ఉన్న కత్తితో గొంతులో పొడుచుకుని, ఆపై వాస్మోల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement