● సాగులో ‘లక్కీ’నేని వీరమ్మ.. | - | Sakshi
Sakshi News home page

● సాగులో ‘లక్కీ’నేని వీరమ్మ..

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

● సాగులో ‘లక్కీ’నేని వీరమ్మ..

మదనపల్లె మండలం టేకులపాళెంకు చెందిన లక్కినేని వీరమ్మ ప్రకృతి సేద్యం ద్వారా మంచి ఫలితాలతో పాటు ఆదాయం పొందుతోంది. రెండు ఎకరాల పొలంలో మిరప, వంగ, టమోటా, మటిక, వేరుశనగ, కందులు, అనుములు అలసంద, అనప, సజ్జలుతో పాటు అనుబంధ పంటలు (జీవవైవిధ్య పంటల సంఖ్య) పెసర, చుక్కాకు, మొక్క జొన్న, బెండ, గోంగూర, ముల్లంగి, బీట్‌ రూట్‌, క్యారెట్‌ సాగు చేశారు. ఈ పంటలకు 800 కిలోల ఘన జీవామృతం వినియోగించారు. ఈ పంటల సాగు ద్వారా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. పెట్టుబడి ఖర్చు రూ.36,200 పోను రూ.1,64,800 నికర ఆదాయం సాధించి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. ఈ విధానంలో సాగు వల్ల ఆదాయం రావడమే కాక భూమి కూడా సారవంతంగా మారిందని వీరమ్మ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement