వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
నందలూరు(రాజంపేట): రానున్న సర్పంచి ఎన్నికలకు పార్టీ క్యాడర్ సన్నద్ధం కావాలని...ఆ ఎన్నికల్లో కూటమి నాయకుల అక్రమాలకు ప్రజలే బుద్ధి చెబుతారు..తిరగబడతారని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. మంగళవారం నందలూరు విష్ణుప్యారడైజ్లో మండలపార్టీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి అధ్యక్షతన జరిగిన మండల, గ్రామస్థాయి నేతలతో ఎమ్మెల్యే సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా పార్టీ క్యాడర్‌తో వరుసగా సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పంచాయతీ సర్పంచి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. పురపాలకసంఘం, కార్పొరేషన్ ఎన్నికలు, మండలపరిషత్ ఎన్నికలలో జరిగిన పచ్చమూకల అరాచకాలను ఓటర్లు జీర్ణించుకోలేకున్నారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను వేయకుండా అడ్డుకునేందుకు ఏవిధంగా అరాచకం చేశారో గత ఎన్నికల్లో చూశామన్నారు. పోలీసులను, అధికారులను అడ్డంపెట్టుకుని సర్పంచి స్థానాలను దక్కించుకోవాలనుకుంటే ప్రజలు చూసి ఊరుకోరన్నారు. గ్రామంలో పార్టీ క్యాడర్ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సమన్వయంగా ముందుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వవైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలన్నారు. నందలూరు మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచి ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. పార్టీ మద్దతుదారులకు పార్టీ శ్రేణులు అండగా నిలబడాలన్నారు. సమావేశంలో మండల పార్టీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి తదితర మండలస్ధాయి నేతలు పాల్గొన్నారు.


