బైక్‌ అదుపుతప్పి కిందపడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి కిందపడి మహిళ మృతి

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

మదనపల్లె టౌన్‌: కురబలకోట మండలంలోని అంగళ్లు దుర్గా డాబా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన నూర్జహాన్‌ (53) బి.కొత్తకోటకు సొంత పనుల మీద వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి మదనపల్లెకు వెళ్తుండగా,మార్గమద్యంలోని అంగళ్లు వద్ద రోడ్డు మధ్యలో గుంత ఉండటంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నూర్జహాన్‌ కింద పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement