వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండల పరిధిలోని కుందూ నది పరివాహక ప్రాంతంలో నీరు రోజురోజుకు ఇంకిపోతూ ఎడారిని తలపిస్తోంది. వర్షాలు సమృద్ధిగా పడకపోవడం, మరోవైపు సాగు అవసరాల కోసం నదికి నీటిని విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. దీనివల్ల కుందూ నది నీటిపైనే ఆధారపడి సాగు చేసిన వరి, పసుపు పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సాగు సంగతి పక్కన పెడితే, కనీసం రజకులు బట్టలు ఉతుక్కునేందుకు కూడా చుక్క నీరు లేని దుస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి కుందూ నదికి నీటిని విడుదల చేసి, తమను ఆదుకోవాలని స్థానిక రైతులు, రజకులు వేడుకుంటున్నారు. – చాపాడు


