చెదిరిన ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

చెదిరిన ముస్తాబు

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● పర్యవేక్షణ లోపంతో పడకేసిన పథకం

మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణను పెంపొందించడానికి విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శ్రీముస్తాబుశ్రీ (డైలీ హైజీన్‌ అండ్‌ డిసిప్లిన్‌) కార్యక్రమం జిల్లాలోని పాఠశాలల్లో అభాసుపాలవుతోంది. ఈ పథకం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైంది. ప్రారంభంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన శ్రీముస్తాబు కార్నర్లుశ్రీ ఇప్పుడు చాలా పాఠశాలల్లో వస్తువులు లేక వెలవెలబోతూ, కేవలం నామమాత్రంగా దర్శనమిస్తున్నాయి.

జీఓ ఉంది.. ఆచరణేది?

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీఓ నంబర్‌ 43 ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం ప్రతి తరగతి గదిలో ఒక అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్‌వాష్‌, నెయిల్‌కట్టర్‌తో కూడిన శ్రీముస్తాబు కార్నర్‌శ్రీ ఏర్పాటు చేయాలి. దీనితో పాటు చేతులు కడుక్కోవడం, టాయిలెట్‌ వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఐఈసీ చార్టులను ప్రదర్శించాలి. ప్రతి వారం నిబంధనలు పాటించే విద్యార్థులను శ్రీస్టార్‌ ఆఫ్‌ ది వీక్‌శ్రీగా ఎంపిక చేసి రివార్డులు ఇవ్వాలి. బడికి అపరిశుభ్రంగా వచ్చే పిల్లలను గుర్తించి, వారిని మందలించకుండా పాఠశాలల్లోనే ముస్తాబు చేయించాలనేది ఈ జీఓ సారాంశం.

పర్యవేక్షణ లోపంతో కనుమరుగు

ప్రారంభంలో కొన్ని రోజులు ఈ నిబంధనలను అమలు చేసినప్పటికీ, ఆ తర్వాత ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి చూపడం మానేశారు. ముస్తాబు కార్నర్లలో పెట్టిన వస్తువులు క్రమంగా మాయమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ ఉన్నతాధికారుల తనిఖీలు, పర్యవేక్షణ పూర్తిగా లోపించడమే ఈ పథకం పడకేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, శ్రీముస్తాబుశ్రీ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలుః 2072

విద్యార్థుల సంఖ్యః 1,15,649 మంది

ప్రైవేటు పాఠశాలలు ః 5454

విద్యార్థుల సంఖ్యః 1,07,400 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement