విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు కొత్తపల్లె గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జూటూరు బ్రహ్మానందరెడ్డి (56) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మానందరెడ్డి గురువారం ఉదయాన్నే తన పొలం వద్ద మోటారు ఆన్‌ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మేము కూటమిలో ఉన్నామా లేదా

● జనసేన నాయకుడు మంచి శివకుమార్‌

ప్రొద్దుటూరు రూరల్‌: కూటమిలో జనసేన భాగస్వామిగా ఉందా లేదా? పవన్‌కళ్యాణ్‌ను టీడీపీ నాయకులు తమ నేతగా భావిస్తున్నారా? అని జనసేన నాయకుడు మంచి శివకుమార్‌ ప్రశ్నించారు. తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించి, బీరం మౌనికను అధికారిక అభ్యర్థిగా నిలబెడితే.. టీడీపీ నాయకులు మాత్రం స్వతంత్ర అభ్యర్థి సిగినేని సుబ్బమ్మకు పసుపు కండువాలు వేసి మరీ ప్రచారం చేయడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయానికి జనసేన సైనికులు కష్టపడి 230 ఓట్ల మెజారిటీ తెచ్చారని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గ్రామానికి రూ.3.50 కోట్లు కేటాయించారని, దానికి కృతజ్ఞతగా ఈ సీటు గెలవాలని తాము భావిస్తే.. టీడీపీ నాయకులు మూలవారిపల్లెలో కొత్త వ్యక్తులతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేన బూత్‌ ఏజెంట్‌ను పోలీసులు బయటకు పంపారని, మహిళా ఓటర్లను అధికారులు బెదిరించారని మండిపడ్డారు. దీనిపై పోలీసు అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూలవారిపల్లె బూత్‌లో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ, ఈ అక్రమాలను పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని శివకుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement