నామినేషన్ల వివాదంలో కీలక మలుపు..! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల వివాదంలో కీలక మలుపు..!

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

● అప్పీళ్లతో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ

అభ్యర్థులకు గొప్ప ఊరట

● ఖంగుతిన్న టీడీపీ శ్రేణులు

మదనపల్లి (కురబలకోట): అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీల నామినేషన్ల తిరస్కరణపై దాఖలైన అప్పీళ్ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆపై ఆసక్తికరంగా మారింది. తిరస్కరణకు గురైన ఎంపీటీసీలు పలువురు సవాల్‌ చేస్తూ శని, ఆదివారాల్లో సబ్‌ కలెక్టర్‌ ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు. సోమవారం అభ్యర్థులను విచారించిన అనంతరం ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ఎంపీటీసీల అప్పీళ్లపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు సానుకూలంగా ఊరట లభించింది. చిన్నపాటి పొరపాట్లుతో నామినేషన్లు తిరస్కరణకు గురైన వారికి అనుకూలంగా నిర్ణయం వెలువడింది.

● ఓటర్ల జాబితా వివరాలలో వ్యత్యాసాలు, అసంపూర్ణ డిక్లరేషన్‌, ఓటరు జాబితాలో పేర్లు ఉండి కేవలం పార్ట్‌ లేదా సీరియల్‌ నెంబర్లలో చిన్నపాటి వ్యత్యాసాలు లాంటి చిన్నపాటిి పొరపాట్లను పరిగణలోకి తీసుకోకుండా వాటిని యథావిధిగా నామినేషన్లకు ఆమోదం తెలపాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిణామంతో నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులకు భంగపాటు కలిగింది.

● అప్పీళ్ల పరిశీలనలో వివిధ మండలాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు సానుకూలంగా నామినేషన్లకు ఆమోదం తె లుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆపార్టీలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

● జిల్లాలో కురబలకోట మండలంలో వైఎస్సార్‌ సీపీ 23 నామినేషన్లు వేయగా ఏకంగా 19 వాటిని తిరస్కరించారు. ఇది సంచలనంగానే కాకుండా చర్చనీయాంశంగా కూడా మారింది. కాగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లగా మెజారిటీ స్థానాల్లో వీరి అప్పీల్‌కు సానుకూల ఆమోదం లభించడంతో ఎన్నికల సమరం అనివార్యమైంది. దీంతో పోటీ నే లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలన్న టీడీపీ పన్నాగానికి గట్టి బ్రేక్‌ పడింది.

● జిల్లాలో 321 ఎంపీటీసీ స్థానాలకు 1449 నామినేషన్లు వేయగా వాటిలో 1141 ఆమోదం పొందాయి. ఇందులో వైఎస్సార్‌ సీపీ 490 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 343 ఆమోదం పొందాయి. వీటిలో వివిధ కారణాలతో 147 నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. వీటిలో చాలా స్థానాలకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వైఎస్సార్‌ సీపీకి చెందిన అభ్యర్థుల నామినేషన్లను వివిధ మండలాల్లో అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌ స్థాయిలో అభ్యర్థుల అప్పీళ్లపై రిటర్నింగ్‌ అధికారులతో సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓలు సమీక్షించారు. సోమవారం మధ్యాహ్నం నుండి సీల్డ్‌ కవర్లలో నేరుగా అభ్యర్థులకు వీఆర్వోలు వ్యక్తిగతంగా కలసి ఆర్డర్స్‌ను అందజేశారు. అప్పీళ్లకు వెళ్లిన పలువురి అభ్యర్థులకు సానుకూలంగా న్యాయం జరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంత ఆలస్యంగానైనా న్యాయం జరగడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement