పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పులివెందులకు రానున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు బెంగుళూరు యలహంకలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.20గంటలకు జక్కూర్ ఎయిర్‌డ్రోంకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 10.20గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10.35గంటలకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 10.35 గంటల నుంచి సాయంత్రం 6గంటలకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం పులివెందుల్లోని తన నివాసంలో రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం 8గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 8.05గంటలకు భాకారపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 8.10గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 9.20గంటలకు బెంగుళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడ నుంచి విజయవాడలోని తాడేపల్లెలో ఉన్న తన నివాసానికి బయలుదేరుతారు.


