మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఎస్.రవి అన్నారు. సో మవారం మదనపల్లెలో జిల్లాలోని అన్ని ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఐపీఈ–2027 పరీక్షల టైం టేబుల్ వివరాలు తెలియజేశారు. జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఫిబ్రవరి–27 లో జరిగే ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు, కెమికల్స్, మెటీరియల్స్ ను సక్రమంగా ఉంచుకోవాలన్నారు.
మదనపల్లె ఉప విద్యాశాఖ అధికారిగా పద్మావతి
మదనపల్లె సిటీ: మదనపల్లె ఉప విద్యాశాఖ అధికారిగా పద్మావతిని నియమిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్‌అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె నిమ్మనపల్లె మండల విద్యాశాఖ అఽధికారిగా పని చేస్తున్నారు. ఇన్‌చార్జ్ ఉప విద్యాశాఖ అధికారిగా డీఈఓ సుబ్రమణ్యం బాధ్యతలు చూస్తున్నారు. పద్మావతిని రెగ్యులర్ ఉప విద్యాశాఖ అధికారిగా నియమించారు.
జిల్లాకు 91 మంది
నూతన కానిస్టేబుళ్లు
మదనపల్లె టౌన్: 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని అన్నమయ్య జిల్లాకు కేటాయించబడిన 91 మంది నూతన కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లెలో సోమవారం దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతులు పోలీస్ శాఖలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్మార్ట్ పోలీసింగ్ చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల పరిస్థితులు, బందోబస్తు విధులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, సీఐలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఆలస్యంగా రైలు
ములకలచెరువు: తిరుపతి నుంచి కదిరిదేవరపల్లి ములకలచెరువు మీదుగా వెళ్లే రైలు సోమవారం తెల్లవారు జామున 2.41 గంటలకు రావాల్సివుండగా 5.45 గంటలకు చేరుకుంది. సుమారుగా 2 గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది. సాంకేతిక లోపంతో రైలు ఆలస్యంగా నడిచిందని రైల్వే అధికారులు తెలిపారు. దీనితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గస్తీ ముమ్మరం చేయండి
కడప అర్బన్: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సోమవారం ఉదయం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జరగనున్న అభ్యర్థుల ప్రచారం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలని, రాత్రి పూట గస్తీ, తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ టి. భవాని, టూ టౌన్ సీఐ శ్రీహరి, ఎస్‌ఐలు కొండారెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేయండి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినా ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్‌ను సోమవారం శ్రీధర్ చెరుకూ రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064తో పాటు, వాట్సాప్ నంబర్ 94404 40057 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చనే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కడప రేంజ్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఎన్.వి. నాగరాజు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


