జిల్లాకు తుపాను ముప్పు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు తుపాను ముప్పు

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి (కురబలకోట): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉండడంతో మంగళవారం నుండి ఈనెల 30 వరకు వాతావరణ పరిస్థితులపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సోమవారం సూచించింది. భారీ వర్షాలు నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు దాటరాదని తెలిపారు. విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని కోరింది. రైతులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్‌ రూమ్‌ 08571–293001 నెంబరును సంద్రదించాలని తెలిపింది.

పోలింగ్‌ కేంద్రాల

జాబితా విడుదల

సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్‌ కేంద్రాల జాబితాను కమిషనర్‌ బి.రమాదేవి ప్రకటించారు. గతంలో 20 వార్డులు ఉండగా ఇప్పుడు 23 కు పెరిగాయి. దీంతోపాటు 22 ఉన్న పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 28కి పెంచారు. పెరిగిన పోలింగ్‌ కేంద్రాలపై రాజకీయ పార్టీలు, ప్రజలు అభ్యంతరాలను మంగళవారం సాయంత్రంలోగా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిషనర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement