– కలెక్టర్ నిశాంత్‌కుమార్
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో అమరావతి చాంపియన్‌షిప్–26లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను అభినందించారు. బ్యాడ్మింటన్‌లో మోతుకూరి కళ్యాణి, కందుకూరి లక్ష్మి, సింధూర ద్వితీయ స్థానాల్లో నిలిచి రజత పతకాలు పొందారు. బాక్సింగ్‌లో సిరవేలు నిఖిల్‌దేవ్‌నాయుడు ద్వితీయస్థానం, అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో సుంకు గంగాధర్ ద్వితీయ స్థానం సాధించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీఎస్‌డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు దిశ సమావేశం
సాక్షి, మదనపల్లె: జిల్లా సమన్వయ అభివృద్ది, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) బుధవారం రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అధ్యక్షతన మదనపల్లెలో జరగనుంది. స్థానిక కలెక్టరేట్‌లో ఉద యం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి కలెక్టర్, జిల్లా అధికారులు, మండల పరిషత్ అధ్యక్షులు హజరవుతారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మిథున్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. పథకాలు మంజూరు, వాటి నిధులు వినియోగం, పనుల తీరుపై సమీక్షిస్తారు. నిధుల వినియోగంలో జాప్యం, త్వరితగతిన పనులు సాగకపోవడం లేదా అమలులో సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు. ఈ సమావేశానికి హజరుకావాలని జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులకు సమాచారం పంపించారు.
నైపుణ్యం పోర్టల్‌లో
నమోదు కావాలి
– జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి
హెచ్. దొన్నప్ప
మదనపల్లి (కురబలకోట): విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపై అందించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ఆధ్వర్యంలో నైపుణ్యం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నమయ్య జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి హెచ్. దొన్నప్ప తెలిపారు. జిల్లాలోని ప్రతి విద్యార్థి, నిరుద్యోగ యువకులు తప్పనిసరిగా నైపుణ్యం పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపు ణ్యాలు, అనుభవం, ధ్రువపత్రాలు, రెజ్యుమ్, కేరీర్ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవడం ద్వారా నైపుణ్య శిక్షణలు, జాబ్ మేళాలు, రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లు, ఉద్యోగ అవకాశాల సమాచారం పొందవచ్చన్నారు. జిల్లాలో ని విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
మా డబ్బు కోసం
ఉద్యమమే శరణ్యం
– కలెక్టరేట్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన
సాక్షి, మదనపల్లె: ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షులు నరసింహకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. వాట్సప్ డీపీగా సీఎం సార్ మా డబ్బు మాకు ఇవ్వండి అన్న స్లోగన్‌ను పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సదస్సులో నిర్ణయించిన ఉద్యమ షెడ్యూల్ ప్రకారం రెండవ రోజు జిల్లాలోని కార్యాలయాల్లో ఏపీ జేఏసీ అమరావతి సంబంధించిన ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో హాజరై నిరసన వ్యక్తం చేశామన్నారు. కలెక్టరేట్‌లో అన్ని విభాగాల్లో నిరసనలు జరిపామన్నారు. 41,321 మంది ఉద్యోగుల రిటైర్డ్ అయ్యారని అన్నారు. తమ డిమాండ్లలో పీఆర్‌సీ కమీషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లోని ఐదు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు.


