సంబేపల్లె : ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్న విషయంపై మంగళవారం సంబేపల్లె పోలీస్ స్టేషన్‌లో విచారణ నిర్వహించినట్లు రూరల్ సీఐ రోషన్ తెతిపారు. మండల పరిధిలోని జాండ్రిగారిపల్లెకు చెందిన బాబ్జితోపాటు ఇద్దరు, మోటకట్ల గ్రామంలోని ప్రతాప్‌రెడ్డితోపాటు మరొక రైతు దగ్గర నుంచి అనంతపురం 14 బెటాలియన్‌కు చెందిన చంద్రహాసన్, ప్రతాప్ ట్రాక్టర్లను అద్దెకు తీసుకొన్నారు. వారు ఇంత వరకు అద్దె ఇవ్వకుండా ట్రాక్టర్ల ఆచూకీ తెలియక పోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం 14 బెటాలియన్ డీఎస్పీ శివారెడ్డి మంగళవారం సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టారు.


