పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడి ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలచిపోయారు. ఉచిత వైద్యం అంటేనే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. – కాలనీ చిన్న, పీలేరు.
జలయజ్ఞం పథకం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుల పక్షపాతిగా నిలిచారు. రైతుల సమస్యలు తెలుసుకున్న వైఎస్సార్ సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పంటలు సస్యశ్యామలం చేయాలను ఉద్దేశంతో జలయజ్ఞం తెచ్చారు. మన పాంతానికి సాగునీరు ఇవ్వాలని హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకొచ్చారు.
– సి.కె. యర్రమరెడ్డి, కేవీపల్లె.
గాలివీడు మండల పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తోంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. కుడి, ఎడమ కాలువల కింద రైతాంగం పంటల సాగు చేసి జీవిస్తున్నారు. మహనీయుడైన వైఎస్సార్ కలకాలం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.
– వెంకటయ్య, గాలివీడు మండలం


