శక్తి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

శక్తి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

మదనపల్లె సిటీ : ప్రతి విద్యార్థిని శక్తియాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కనుబిల్లి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాల్య వివాహాలకు, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాల్యవివాహాల రద్దు చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. బాలికలు ఆపద సమయంలో 1098, 181, 112 నంబర్లకు డయల్‌ చేయాలన్నారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ హైమావతి, ప్రిన్సిపాల్‌ మోహన్‌కుమార్‌, సీఐలు మహమ్మద్‌రఫీ, సదాశివయ్య, ఫోర్డు డైరెక్టర్‌ జల్లా లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement