కొనసాగుతున్న జూడాల సమ్మె | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జూడాల సమ్మె

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

కడప అర్బన్‌: కడప ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) జూనియర్‌ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె గురువారం 4వ రోజు కొనసాగింది. డాక్టర్‌ యశ్వంత్‌ కృష్ణ, అరవింద్‌, పావని, ప్రణవ్‌ స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ జూనియర్‌ డాక్టర్ల స్టయిఫండ్‌ పెంచాలన్నారు. మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టుల్లో నాన్‌–మెడికల్‌ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టకూడదదన్నారు. ఈక్రమంలో అత్యవసర వైద్య సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లకు త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు.కార్యక్రమంలో కడప జీఎంసీ జూడా అధ్యక్షుడు రవితేజ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement