అట్టహాసంగా ప్రారంభమైన ఏపీ పుట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్రకుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మదనపల్లె సమీపంలోని గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో ఏపీ జూనియర్ బాలుర పుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పుట్‌బాల్ క్రీడలో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆడి మంచి పేరు తెచ్చారన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు. పుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు 24 జట్లు.. 550 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఇందులో జెడ్పీహెచ్‌ఎస్, గ్రీన్‌వ్యాలీ, వశిష్ట, మిషన్‌కాంపౌండ్ మైదానాల్లో పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్‌వ్యాలీ స్కూల్ డైరెక్టర్ రంగారెడ్డి, విష్ణుచైతన్య, పుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ,జాన్ కమలేష్, అసోసియేషన్ కార్యదర్శి నరేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, కిరణ్‌కుమార్, మహేంద్ర, బాలాజీ, క్రీడాకారులు పాల్గొన్నారు.


