రాయచోటి : మందుబాబుల మధ్య నెలకొన్న మాటలు విభేదాలు పెరిగి బీరు బాటిల్స్‌తో దాడి చేసుకునేవరకు దారి తీసింది. కలిసి మద్యం సేవిద్దామని వచ్చిన మి త్రుల మధ్య మాటామాటా పెరిగి వారిచేతిలో ఉన్న మద్యం బాటిల్స్‌తో స్నేహితుడు అన్న కనికరం లేకుండా షేక్ మహ్మద్ ఉమర్ (20) ని పొడిచి ప్రాణాపాయస్థితికి చేర్చాడు. షేక్ మహ్మద్ ఉమర్ తన మిత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం రాయచోటి పట్టణం, చిత్తూరు మార్గంలోని వైన్ షాపుకు వెళ్లారు. తోటి స్నేహితులతో కలిసి మద్యం సేవించే సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ ఘర్షణలో వచ్చిన మిత్రులలో ఒకరు బీరు బాటిల్ పగులకొట్టి అదే బాటిల్‌తో ఉమర్ కడుపుపై రెండు పోట్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన ఉమర్‌ను మిగిలిన మిత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. బాటిల్‌తో పొడిచిన వ్యక్తి ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది.
చీటింగ్ వెనుక గూడుపుఠాణి !
రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్‌లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు.
టీడీపీ నేత సహకారం? ..
నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది.
బీరు బాటిల్‌తో పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు


