రొంపిచెర్ల : నేషనల్ హైవేలో టాటా ఏస్ దగ్ధమై సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాట్లిలిన సంఘటన చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ఫ్యారుసాహెబ్ గుజిరి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం భాకరాపేట నుంచి అన్నమ్మయ్య జిల్లా కె.వి.పల్లె మండలంలో గ్రామాలు తిరిగి న్యూస్ పేపర్లు, ఇనుప సామాన్లు కొనుగోలు చేసి టాటా ఏసీలో లోడు చేసుకుని స్వగ్రమానికి బయలుదేరారు. అయితే రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలోని హైవేలో ఒక్క సారిగా టాటా ఏస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్, క్లీనర్ వాహనం దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. టాటా ఏస్ వాహనంలో క్లీనర్ బీడీ తాగి వేయడం వలనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భా విస్తున్నారు. పీలేరుకు చెందన ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పుటికే పూర్తిగా కాలి పోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందన్నారు. రొంపిచెర్ల ఎస్‌ఐ మధుసూదన్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


