మదనపల్లె టౌన్ : ఎంపీటీసీపై మందుబాబులు దాడి చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. దాడి పై బాధితుడు స్థానిక వన్‌న్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన దేవేంద్ర కొత్తపల్లె ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. దేవేంద్ర స్థానిక చిత్తూరు బస్టాండ్ లోని ఓ మద్యం దుకాణం వద్ద కొంత కాలంగా క్యాంటీన్ నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి పూటుగా తాగిన ఇద్దరు వ్యక్తులు క్యాంటీన్‌న్ వద్దకు వచ్చి స్నాక్స్ తిని ఆపై బిల్లు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో హోటల్ నిర్వాహకుడు, ఎంపీటీసీ దేవేంద్ర వారిని అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు వ్యక్తులు దేవేంద్రపై దాడి చేసి, హోటల్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారని బాధితుడు ఆరోపించారు. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌న్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


