జలధార పనులు వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జలధార పనులు వేగంగా పూర్తి చేయాలి

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

గాలివీడు : జలధార కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం గాలివీడు మండలం అరవీడు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న జలధార ఫీడర్‌ ఛానల్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అరవీడు కొండల ప్రాంతం నుంచి ప్రవహించే వర్షపు నీరు గోరాన్‌ చెరువుకు చేరే మార్గంలో చేపడుతున్న ఫీడర్‌ ఛానల్‌ అభివద్ధి పనుల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ నీరు చిన్నేరు నది ద్వారా పాపాగ్ని నదిలో కలుస్తుందని అధికారులు వివరించారు. పనుల స్థితిగతులను తెలుసుకున్న కలెక్టర్‌, ప్రస్తుతం మిగిలి ఉన్న అన్ని పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్‌ రెడ్డి, సంబంధిత మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లక్కిరెడ్డిపల్లి: జల సంరక్షణ సంకల్పం జలధార పథకం ద్వారా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పాలెంగొల్లపల్లి ప్రాంతంలోని కుక్కలగుట్ట నుంచి కోనంపేట చెరువు వరకు జలధార కార్యక్రమం పనులను కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య,, తహశీల్దార్‌ క్రాంతి కుమార్‌, అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ ఏఈ మహబూబ్‌ బాష, ఆర్‌ఐ రాజేష్‌, ఉపాధిహామి పథకం ఏపీఓ తిరుపాల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో

నాణ్యమైన సేవలు అందించాలి

గాలివీడు: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సూచించారు. బుధవారం గాలివీడు మండలం వెలిగల్లు పెద్ద తాండలోని వీపీ తాండా అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వసతులు, పిల్లల హాజరు, సిబ్బంది విధి నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. పిల్లలు ప్రాథమిక విషయాలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవడం, నాలుగేళ్ల వయస్సు ఉన్న కొంతమంది పిల్లలు తమ పేరు చెప్ప లేకపోవడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. పిల్లల బరువును కలెక్టర్‌ స్వయంగా తనిఖీ చేసి, ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు నమోదుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. విధినిర్వహణలో పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

రామాపురం పీహెచ్‌సీ తనిఖీ

రామాపురం: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్బంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు,మందుల నిల్వలు,వైద్య పరికరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య అందించేందుకు అవసరమైన అన్ని రకాల మందులు,వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మండల వైద్యాధికారి వినోద్‌కుమార్‌ మరియు వైద్యులు,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement