రాయచోటి: రాయచోటిలో తెలుగుదేశం పార్టీ నేతల భూ అక్రమాల దాహం ఇప్పట్లో తీరేలా లేదు. కోర్టు స్టేలు ఇచ్చినా, ప్రభుత్వం అర్హులకు డీకేటీ పట్టా భూములు కేటాయించినా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం తమ దౌర్జన్యకాండ ఆపడం లేదు. ఆక్రమణలకు పాల్పడే ప్రాంతంలోనే డేరాలు వేసుకొని మందిని పోగుచేసుకొని ఆక్రమణలకు అడ్డు వచ్చిన వారిపై దాడి చేసేందుకు వెనుకాడటం లేదు. నెలన్నర క్రిందట పట్టణ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు దశరథ రామిరెడ్డిపై భూ ఆక్రమణ విషయంలో దాడికి తెగబడిన విషయం మరువక ముందే పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఇనాయత్ ఖాన్ చెరువు సమీపంలో 2005లో డీకీటీ పట్టా ఇచ్చిన భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు తెగబడడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రాయచోటి రూరల్ మండలం ఎంపీపీ రాజమ్మ (వైఎస్‌ఆర్‌సీపీ) కు చెందిన ఒక ఎకరం భూమిని పెమ్మాడపల్లి సర్పంచ్ వాసు (టీడీపీ), అతని అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడ్డారు. భూమికి చెందిన డీకేటీ పట్టా, పాస్ బుక్, ఆన్‌లైన్ రికార్డ్స్ మా పేరున ఉన్నాయని, మీకు ఎలాంటి హక్కులేదని అడగటానికి వెళ్లిన ఎంపీపీ రాజమ్మ, ఆమె భర్త వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ నేత పల్లపు రమేష్‌లపై అక్కడే ఉన్న టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డారు.
డీకేటీ పట్టా భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద టీడీపీ నేతలు సర్పంచ్ వాసు, అతని అనుచరులు కబ్జాకు తెరలేపారు. అయితే ఇక్కడ పట్టాలు ఉన్నాయని ఆక్రమణను అడ్డుకున్న ఎంపీపీ రాజమ్మ, జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ బీసీ నేత పల్లపు రమే
Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM
Advertisement


