మదనపల్లె టౌన్ : ఆప్తుల కోసం మృతదేహం ఎదురు చూస్తోందని మదనపల్లెకు చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పెద్దయ్య మంగళవారం మీడియాకు తెలిపారు. సిటిఎం రోడ్డు వేమన్న వీధికి చెందిన వి.పచ్చప్ప మొదలియార్ అనారోగ్యంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల చేరి, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారన్నారు. గతంలో ఆయన తన సంరక్షణలో ఉండేవారని చెప్పారు. మృతుడి బంధు మిత్రులు ఎవరైనా ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటలలోగా పచ్చప్ప మృతదేహాన్ని తీసుకెళ్లాలని, లేనిపక్షంలో మున్సిపాలిటీకి అప్పగిస్తామని పెద్దయ్య తెలిపారు. సమాచారం కోసం రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పెద్దయ్యను గానీ, రుయా వైద్యులను గానీ సంప్రదించ వచ్చునని తెలిపారు.


