చంద్రబాబు వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

గుర్రంకొండ : చంద్రబాబు నాయుడు రెండేళ్ల పరిపాలనలో చేసిన వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం గుర్రంకొండలోని గోల్డెన్‌ ప్లాజా కల్యాణ మండపంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబెలూన్లను ఎగురవేసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి వైఎస్సార్‌సీపీ రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యిందన్నారు. ముఖ్యంగా రైతులను, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను దారుణంగా మోసం చేసిందన్నారు. రైతులకు పంటనష్టపరిహారం చెల్లించకుండా రెండేళ్లుగా దగా చేస్తోందన్నారు. నియోజకవర్గంలో పోలీసులు నాయకులపై పెడుతున్న అక్రమ కేసుల విషయం పార్టీ అఽధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి తప్పు చేశామంటూ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి ఎంతో మంది నిరుద్యోగులకు జీవితం లేకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం 20 లక్షల మంది తల్లులుకు ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుప్రయాణం అంటూ ఉన్న బస్సులను నిలిపివేస్తుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీపం పథకం అరకొరగా మహిళలకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రాష్ట్రంలొ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు ముక్తియార్‌ఆలీఖాన్‌, జగన్మోహన్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డి, చింతల రమేష్‌కుమార్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, పులి శివారెడ్డి, జెడ్పీటీసీలు రత్నశేఖర్‌రెడ్డి, ఆనంద్‌, ఎంపీపీలు అప్పల్ల, శ్రీదేవి, నాయకులు రాహుల్‌ చక్రవర్తి రెడ్డి, నల్లారితిమ్మారెడ్డి, చింతల శివానందరెడ్డి, మహితా ఆనంద్‌, సుంకర చక్రధర్‌, హరిత, నక్కాచంద్రశేఖర్‌, జమీర్‌, ప్రకాష్‌రెడ్డి,బాబురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేశవరెడ్డి, కలీమ్‌, నాగేంద్ర, ఎల్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.

పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement