ఏఆర్‌ డీఎస్పీకి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ డీఎస్పీకి సన్మానం

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

మదనపల్లె టౌన్‌ : విధి నిర్వహణలో నిబద్ధత, నిరంతర శ్రమ ఉంటే ఉన్నత శిఖరాలు దానంతట అవే వరిస్తాయని రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.జె.రామకృష్ణ నిరూపించారు. జిల్లా పోలీస్‌ శాఖలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించి, తనదైన చెరగని ముద్రవేశారు. మంగళవారం ఆయన ఏఆర్‌ డీఎస్పీగా పదోన్నతి పొందారు. పదోన్నతిపై చిత్తూరు జిల్లాకు బదిలీ అవుతున్న సందర్భంగా మదనపల్లె జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌, ఏఎస్పీ వేంకటాద్రి, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి ఆయనకు ఘనంగా సన్మాన, వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ ఆత్మీయ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ ధీరజ్‌.. రామకృష్ణను స్వయంగా దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

వృద్ధుడి ఆత్మహత్య

మైదుకూరు : మున్సిపాలిటీలోని గడ్డంవారిపల్లె వద్ద ఉన్న ఇండస్ట్రీయల్‌ సముదాయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న చల్ల ఆంజనేయులు(70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు నిత్యం మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement