గంగమ్మా..దీవించమ్మా | - | Sakshi
Sakshi News home page

గంగమ్మా..దీవించమ్మా

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

వాల్మీకిపురం: స్థానిక వాల్మీకి నగర్‌లో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో సోమవారం ఉదయం పుష్పపల్లకిలో సింహవాహం అధిరోహించిన అమ్మవారు గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, బాణాసంచా పేళ్లుల్లు మధ్య ఊరేగింపు కొనసాగింది. భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించారు. గంగమ్మా..దీవించమ్మా అని మొక్కుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద నృత్యాలు, కోలాటాలు, ఆకట్టుకున్నాయి.

10న మెగా జాబ్‌మేళా

మదనపల్లె సిటీ, పుంగనూరు: పుంగనూరులో ఈనెల 10వతేదీన మోగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రాంగణంలో ఉదయం నుంచి జరిగే వేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, అర్హులైన అభ్యర్థుఽలకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్‌ ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌ మేళాలలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.మరిన్ని వివరాలకు 7780599208 6301612761,9553202509 నంబర్లలో సంప్రదించాలన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి

మదనపల్లె సిటీ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఉచిత సమ్మర్‌ ఫుట్‌బాల్‌ కోచింగ్‌ ముగింపు కార్యక్రమం జరిగింది. క్రీడాకారులకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కోచింగ్‌ క్యాంపు వల్ల విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరిగిందన్నారు. ఇదే స్పూర్తితో పాఠశాలలో జరిగే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కోచింగ్‌లో నేర్పిన మెలకువలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డిఎస్‌డిఓ చంద్రశేఖర్‌, ఎంఈఓ ఆంజనేయులు, పీడీలు అన్సర్‌బాషా, మురళి, నరేష్‌, మహేంద్ర, బాలాజీ, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబేపల్లె పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు

మదనపల్లె టౌన్‌: సంబేపల్లె పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీ ధీరజ్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సంబేపల్లెలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దొంగలు ఇటీవల విగ్రహాలను చోరీ చేశారు. అయితే ఫిర్యాదుపై స్థానిక పోలీసులు స్పందించకపోవడమే కాకుండా, కేసును తారుమారు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. సోమవారం మదనపల్లె పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. విగ్రహాలు చోరీ చేసిన దొంగలను త్వరగా అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో శంకరా, వెంకటరమణ, నాగరాజా తదితరులు ఉన్నారు.

రిక్రూట్‌మెంట్‌

దరఖాస్తు గడువు పెంపు

కడప ఎడ్యుకేషన్‌: ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ –2026 కు సంబంధించిన అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు ఒక వారం పొడిగించారని రిజిస్ట్రార్‌ ఆచార్య పద్మ వెల్లడించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ,రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీని 15వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.అర్హులైన దరఖాస్తుదారుల జాబితా 29న ప్రదర్శిస్తామని వివరించారు.అర్హులైన అభ్యర్థుల తుది జాబితా 7వ తేదీ ప్రకటించనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement