మదనపల్లె (కురబలకోట): పూర్వ కాలం నుంచి భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న యోగా ఉత్కృష్టమైనదని, ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగాడే–26డే ఉత్సవాల సందర్భంగా తొలి రోజు మదనపల్లె జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆర్యోగం, మానసిక ప్రశాంతత పొందొచ్చని తెలిపారు. జూన్ 11న హార్సిలీహిల్స్, 14న బోయకొండలో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణశర్మ మాట్లాడుతూ యోగాను జీవితంలో అలవాటుగా మార్చుకోవాలన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి గ్రామాల్లో కూడా యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తరింపజేయాలని వివిధ శాఖల ఉద్యోగులకు సూచించారు.మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి, కరుణాకర్, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని నవ చైతన్య భారతి స్కూల్ విద్యార్థుల యోగా ప్రదర్సన ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ వారిని మెచ్చుకుని ప్రశంసపత్రాలు అందజేశారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


