ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ కక్షసాధింపునకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలు, అబద్ధాల ప్రచారమే అజెండాగా మారింది. ఏ విషయాన్ని ప్రశ్నించినా జగనన్న పాలన అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కూటమి పాలనకు అంతం తప్పదు.
– వి.మనూజ, మాజీ మున్సిపల్ చైర్మన్
మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యే పెత్తనం పెరిగింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. రాష్ట్రంలో అవినీతిలో మదనపల్లె మొదటి స్థానంలో ఉంది. కలెక్టరేట్‌కు సమస్యలపై వెళ్తే పరిష్కారం కావడం లేదు. కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారిపోయాయి. సామాన్యులకు న్యాయం జరగడం లేదు.
– మురళి, ిసీపీఐ నియోజకవర్గ కార్యదర్శి
రాష్ట్రంలో ఈ రెండేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయి. పాలన పేరుకే సాగుతోంది. సంక్షేమం, అభివద్ధి లేదు. మ హిళలు, రైతులు, యువత, తీవ్ర నిరాశలో ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఘోర వైఫల్యం నెలకొంది.
– కృష్ణప్ప, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి


