పీలేరు : మండలంలో అడ్డూ అదుపూ లేకుండా గుట్టలు తవ్వి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని తలపుల, గూడరేవుపల్లె, జాండ్ల తదితర గ్రామాల్లోని గుట్టలను కొంత మంది అధికార పార్టీ నాయకులు తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ జేసీబీల సాయంతో గుట్టలు తవ్వి మట్టిని టిప్పర్లకు నింపి తరలిస్తున్నారు. వందలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మట్టిని చెరువు స్థలాల్లో నింపి చదును చేసి వెంచర్లుగా మారుస్తున్నారు. మరోవైపు గుట్టలను కనుమరుగు చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.


