పెండ్లిమర్రి : పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరను సస్పెండ్ చేస్తూ సోమవారం ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది 2026 పబ్లిక్ పరీక్షల సమయంలో డిపార్టుమెంట్ ఆఫీసర్ భూతలింగేశ్వర్‌పై ప్రిన్సిపల్ ఇందిర దురుసుగా ప్రవర్తించడంతోపాటు దాడికి పాల్పడ్డారని అప్పట్లో ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నివేదికను కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ ఇంటర్‌బోర్డుకు అందించడంతో ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు.
సోలార్ కంపెనీ ఉద్యోగి బలవన్మరణం
మదనపల్లె టౌన్ : భార్య మరొకరితో వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సోలార్ కంపెనీ ఉద్యోగి ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామం ఎరగ్రుండ్లపల్లెకు చెందిన వెంకటరమణ నాయక్ కుమారుడు మల్లికార్జున నాయక్(31) స్థానికంగా ఉన్న సోలార్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చాడు. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య చంద్రకళ మరో యువకుడితో వెళ్లిపోయిందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఊరికి సమీపానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మరొకరితో వెళ్లిపోవడంతో మనస్తాపం


