● శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

● శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement