మదనపల్లె సిటీ : క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ చేపట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక హెల్పింగ్‌మైండ్స్ కార్యాలయంలో గట్టుకు చెందిన జనార్థన్‌రెడ్డి, నర్మద దంపతుల కుమార్తె సాయినిహారిక, ములకలచెరువుకు చెందిన మురళీధర్, సౌభాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె సాయి గోపికలు కేశాలు దానం చేశారు. వారు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారికి ప్రశంసా పత్రాలు, పూల మొక్కలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ నిర్వాహకులు అబూబకర్‌సిద్దిక్, సభ్యులు పాల్గొన్నారు.


