రామసముద్రం : రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ ఏతూరుపల్లి గ్రామంలో గత 20 రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి బోరుకు ఉన్న కేబుల్ వైరును గుర్తుతెలియని దుండగులు చోరీకి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ అధికారులు ఈ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా గ్రామస్తులు పనులు వదులుకుని విద్యుత్ సరఫరా వేళల్లో తాగునీటి కోసం రైతుల బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో ఇన్ని రోజులు సమస్యతో అవస్థలు పడుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


