టమాట కిలో రూ.37 | - | Sakshi
Sakshi News home page

టమాట కిలో రూ.37

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్లో కిలో అత్యధిక ధర రూ.37 పలికింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. శుక్రవారం కిలో రూ.34పలికిన ధర శనివారం ఏకంగా కిలోకు మూడు రూపాయలు పెరిగింది. 783 టన్నుల టమాట మార్కెట్‌కు వచ్చింది. పెరుగుతున్న ధరలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.

ఇంటర్‌ తరగతులు

ప్రారంభం

మదనపల్లె సిటీ : జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాలేజీకి విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మరో వైపు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుండటంతో తరగతులు పెద్దగా నిర్వహించలేదు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో మొదటి రోజులు తరగతులు ప్రారంభించారు.

ఆహార భద్రతపై

అవగాహన సదస్సు

పుంగనూరు : జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం స్థానిక లీనార్డ్‌ పాఠశాలలో ఆహార భద్రతపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి గురులక్ష్మీ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుగుణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే నిత్యం తినే ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తినాల ని, చిరుతిండ్లు మానేయాలని సూచించారు.

ఖతర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మదనపల్లె సిటీ : ఖతర్‌లో హోమ్‌కేర్‌ నర్సుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం నర్సింగ్‌ చదివి, 21 నుంచి 40 ఏళ్లలోపు పురుషులు, సీ్త్రలు అర్హులన్నారు. రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుందన్నారు. ఒప్పంద కాలం రెండేళ్లు ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 8లోపు నైపుణ్యం యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement