పీలేరురూరల్ : మండలంలోని రేగళ్లు, బాలంవారిపల్లె పంచాయతీల పరిధిలో శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. మండలంలోని బాలంవారిపల్లె పంచాయతీ మొరవపల్లె వద్ద నాయునిచెరువు సఫ్లైచానల్ ఉపాధి పనులు చేస్తుండగా చిరుత పులిని చూసినట్లు ఓ కూలీ అందరికీ సమాచారం ఇచ్చాడు. దీంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు అటవీశాఖ, రెవెన్యూ అధికారులకు తెలియచేశారు. దీంతో కలికిరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గిరి, వీఆర్వో నారాయణ, గ్రామస్తులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత జాడ ఎక్కడా కనబడలేదని ఎఫ్‌బీవో తెలిపారు. నక్కను గానీ, హైనాను గానీ చూసి చిరుతగా భావించి ఉండవచ్చునని చెప్పారు. అయినా గ్రామస్తులు రెండుమూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
పీలేరు : వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ టి.అశోక్ ప్రతాప్‌రావు అన్నారు. శనివారం స్థానిక కడప రోడ్డు మార్గంలోని ఫ్లై ఓవ ర్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు డార్జిలింగ్ లైట్ తప్పనిసరిగా అమర్చాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిపికేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తదితర పత్రాలు విధిగా తమ వద్ద కలిగి ఉండాలన్నా రు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పీలేరు ఎంవీఐ విజయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సైకిల్ ర్యాలీ
మదనపల్లె సిటీ : ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లెలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ మైదానంలో ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు, కోచ్‌లు, పీడీలు పాల్గొనాలని కోరారు.
12 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు
మదనపల్లె సిటీ: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈనెల 12 నుంచి ప్రా రంభమవుతాయని మదనపల్లె ఓపెన్‌స్కూల్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ మహహ్మద్ ఖాన్ తెలిపారు.ఆన్‌లైన్‌లో అడ్మిషన్లకు జూలై 30 వరకు గడువుందని సూచించారు. ఈ అవకాశాన్ని వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


