రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

కలికిరి : రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జి.శివనారాయణ అన్నారు. వ్యవసాయ శాఖ పొలం సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మర్రికుంటపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ పచ్చిరొట్ట, జీవన ఎరువులు, వర్మీ కంపోస్టు ఎరువులు వినియోగిస్తే రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో చిరుధాన్యాలు సాగుచేయాలని సూచించారు. డీఆర్‌సీ ఏఓ రామక్రిష్ణ, ఏఓ హేమలత, ఆత్మ బీటీఎం అమృత్‌కుమార్‌రెడ్డి, ఏఈఓ ఇంద్ర, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌, ఏపీసీఎన్‌ఎఫ్‌, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement