రైలుకింద పడి యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి యువకుడు..

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

పీలేరురూరల్‌ : రైలుకింద పడి మధ్యప్రదేశ్‌ యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణ శివారు ప్రాంతం చిత్తూరు రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రట్లం జిల్లా రింగ్‌నోడ్‌కు చెందిన భరత్‌కుమార్‌ (35) పీలేరు పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా అక్కడక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిత్తూరు రోడ్డు మార్గంలో మోడల్‌ కాలనీ సమీపంలో నాగర్‌కోయిల్‌ నుంచి ముంబై వెళుతున్న రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement