చెరువులో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

పీలేరురూరల్‌ : స్థానిక అయ్యపునాయుని చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీ వంకిరెడ్డిగారిపల్లెకు చెందిన శివరామిరెడ్డి (65) శుక్రవారం పీలేరులో బంధువుల ఇంటికి వచ్చి ఆచూకీ కనిపించలేదు.కుటుంబ సభ్యులు యర్రావారిపాళెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం స్థానిక అయ్యపునాయునిచెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement