స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పోలీసులు
రాయచోటి : జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పో లీసులు చురుగ్గా పాల్గొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధా న కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయాలు, సర్కి ల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలతోపాటు అన్ని పోలీసు స్టేషన్‌లలో శ్రమదానం చేశారు. చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల్లో శుభ్రతపై చైతన్యం పెంచే దిశగా కృషి చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ములకలచెరువు : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపం చెందిన ఒక యువతి విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని పెద్దపాళ్యంకు చెందిన ఎస్. అమ్మాజాన్, అదే గ్రామానికి చెందిన సునీల్‌లు ప్రేమాయణం సాగించారు. వీరిద్దరూ మదనపల్లెలో ఉంటూ గత కొన్ని నెలలుగా సహజీవం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేశాడు. ఈ విషయం పై ఆమె ప్రియుడైన సునీల్‌కు చెప్పడంతో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. పెద్దపాళ్యంలో గత మూడు రోజులుగా పెద్దమనుషులు ఈ విషయంపై యువకుడి కుటుంబ సభ్యులతో చర్చించారు. వారు సైతం పెళ్లికి నిరాకరించారని మనస్తాపం చెందిన అమ్మాజాన్ విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనతో తిరుపతికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చేపట్టిన అభివృద్ధిపై జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అవుతున్నా కూటమి పాలనలో ఎక్కడా అభివృద్ది అన్నది కనిపించడం లేదు. దాంతో గత ప్రభుత్వ అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. వీటి వివరాలను తెలిపే బోర్డులను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ, ఎంత అభివృద్ధి జరిగింది, నిధుల వివరాలను శిలాఫలకాలపై రాశారు. ఇందులో కనిపిస్తున్న అభివృద్ధి పనుల వివరాలను చూసి భరించలేని వ్యక్తులు వాటిపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోట గ్రామంలో వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి వివరాలను అక్కడి శిలాఫలకంపై రాశారు. దీనిపై శుక్రవారం రాత్రి దుండగులు రంగు పూశారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలే నియోజకవర్గంలో పలుచోట్ల చేశారు. శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ చర్యపై వైఎస్సార్‌సీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నిరసన
నవాబుకోటలో శిలాఫలానికి రంగు పూయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు శిలాఫలకం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ మొహమూద్, సర్పంచులు సుబ్బిరెడ్డి, మంజునాథరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సీవీ రమణ, మాజీ సర్పంచ్ గిరిస్వామి, మాజీ విండో చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి, శివారెడ్డి, వెంకటరెడ్డి, సతీష్, బాబురెడ్డి, శ్రీనివాసులు, మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పోలీసులు
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పోలీసులు


