నేడు సత్యసాయిబాబా జయంతివేడుకలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈనెల 23వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, ని యోజకవర్గం, మండల స్థాయిలో బాబా వందో జయంతి వేడుకలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో బాబా భక్తులు, ఎన్జీఓల సమన్వయంతో నిర్వహించాలని తెలపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాలల మూడో సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్‌వీ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27,29 డిసెంబర్ 1,3,5,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ పరీక్షలు జరుగుతాయని అందులో పేర్కొన్నారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి శనివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ముందుగా టీటీడీ అధికారులు తెచ్చిన నూతన పట్టు వస్త్రాలు, పుష్పాలు, తులసి గజమాలతో అలంకరించారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కి పంచామృతాభిషేకాలు జరిపారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మకొండ ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిని పూర్తి చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హరి జవరహర్‌లాల్ అన్నారు. శనివారం ఆయన స్థానిక శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను ఆడిగి తెలుసుకొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్, ఏఈలు శ్రీనివాసులు, సంతోష్, ఇన్స్‌పెక్టర్ శివయ్య, ఆలయ ఈవో మంజుల పాల్గొన్నారు.
రాజంపేట: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ సంగరాజు బాలరాజు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాయచోటి రోడ్‌లోని తిరుమల కన్వన్షెన్ సెంటర్‌లో ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వందలాది మంది వైద్యులు తరలివచ్చారు.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు దిలీప్ బన్సాలి, జాతీయ మాజీ అధ్యక్షుడు వినయ్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.దగ్గుమాటి శ్రీహరిరావు ముఖ్యఅతిధులుగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, ఐఎంఏ తాజా మాజీ ప్రెసిడెంట్ జి. నందకిషోర్, శ్రీశైలం దేవస్థ్ధానం చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, గౌరవకార్యదర్శి డా.బోస్,మాజీ అధ్యక్షుడు ఎంజెసీనాయుడు,ఐఎంఏ నేతలు కార్తీక్, డా.సీ.సుధాక ర్, శ్రీహరి, డా.అనిల్, డా.నవీన్, డా.సునీల్, ఎం.విజయకుమార్, జె.చలమయ్య, ధనశ్రీ పా ల్గొన్నారు.అనంతరం బాలరాజు మాటా ్లడు తూ ఐఎంఏ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
నేడు సత్యసాయిబాబా జయంతివేడుకలు
నేడు సత్యసాయిబాబా జయంతివేడుకలు


