రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని సీటీఎంకు చెందిన విజయ్‌కుమార్(50) గుర్రంకొండ మండలం తరిగొండలో హోమియోపతి కాంపౌండర్‌గా పనిచేసేవాడు. అక్టోబర్ 25న వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో సీటీఎం నుంచి మదనపల్లెకు వచ్చి తిరిగి వెళుతుండగా, కొత్తవారిపల్లె వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ తెలిపారు.


