● సగటు 9.5 మీటర్లు
మదనపల్లె: జిల్లాలో భూగర్భ జలాలు ౖపైపెకి ఎగబాకాయి. ఏప్రిల్ నుంచి భూగర్భ జలమట్టాలు అటుపోట్లకు గురై పెరుగుతూ..తగ్గతూ వస్తుండగా అక్టోబర్‌లో ఈ పరిస్థితులన్నీ తలకిందులై భారీగా భూగర్భ జలమట్టం పెరిపోయింది. దీంతో జిల్లాలో ఇప్పట్లో నీటి వనరులకు ఎలాంటి కొరతలేని పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు పెరిగిన భూగర్భజలాలు కొన్నినెలలదాకా ఇదే మట్టంతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని చిన్నమండ్యంలో కే వలం నాలుగు అడుగుల లోతులో అంటే 1.12 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతుండగా, లక్కిరెడ్డిపల్లెలో అధికలోతులో నీటిలభ్యత ఉందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ లెక్కించిన నీటి గణాంకాలు చెబుతున్నాయి.
చిన్నమండెం రికార్డు: జిల్లాలో 30 రెవెన్యూ మండలాలు ఉండగా అందులో చిన్నమండ్యం మండలంలో భూగర్భ జలమట్టం కేవలం 1.12 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. మిగతా మండలాల్లో నీటిలభ్యత దిగువనుంచి పైకి పెరిగినా మూడు మండలాల్లో మాత్రం ఆ పరిస్థితిలేదు. జిల్లాలో లక్కిరెడ్డిపల్లె మండలంలో భూగర్భజలమట్టం 26.51 మీటర్లకు పడిపోయింది. తర్వాత ఓబులవారిపల్లె మండలంలో 21.47 మీటర్లు, పుల్లంపేట మండలంలో 15.73 మీటర్లలోతుకు భూగర్భజలం పడిపోయింది. మిగతా మండలాల్లో ఈ మూడు మండలాల మాదిరిలేవు. దాదాపు భూగర్భ జలమట్టం భారీగా పైకి వచ్చింది. ఏప్రిల్‌లో సంబేపల్లి మండలంలో భూగర్భజలమట్టం ఆందోళనకర స్థితిలో 40.10 మీటర్లలో ఉండగా ఆక్టోబర్‌లో అధికంగా 8.57 మీటర్లకే నీటిలభ్యత పెరిగింది. అదే గతేడాది అక్టోబర్‌లో జిల్లాలో భూగర్బజల మట్టం భారీగా తగ్గింది. ఉదాహరణకు చిట్వేలిలో 34.53 మీటర్లు, ములకలచెరువులో 28.12 మీటర్లు, ఓబులవారిపల్లెలో 24.89 మీటర్లు, సంబేపల్లెలో 24.33 మీటర్లు, కురబలకోటలో 23.53 మీటర్లలోతుకు జలమట్టం పడిపోయింది. ఇప్పుడు ఇదేనెలలో అనూహ్యంగా జలమట్టం భారీగా పెరగడం విశేషం.
వర్షాలతో పుడమి నిండా జలం
చిన్నమండెంలో 1.12 మీటర్లకేభూగర్భజలాలు
లక్కిరెడ్డిపల్లెలో 26.51 మీటర్లలోతుకు దిగిన జలమట్టం
సరాసరి 9.5 మీటర్లలో నీటి లభ్యత
జిల్లాలో భూగర్భజలాలు అక్టోబర్‌లో సగటున 9.5 మీటర్ల లోతులోనే లభ్యం అవుతున్నాయి. అదే ఏప్రిల్‌లో సగటు 16 మీటర్ల ఉండగా మేలో 15.4, జూన్‌లో 16.1, జూలైలో 16.0, ఆగస్టులో 13.8, సెప్టెంబర్‌లో 12.9 మీటర్లు సగటు భూగర్భ జలా లు పైకి ఎగబాకాయి. దీన్ని పరిశీలిస్తే ఏప్రిల్ నుంచి నీటిమట్టం పైకి ఎగబాకుతూ వస్తోంది. అక్టోబర్‌లో తుఫాను ప్రభావిత వర్షాలు భూగర్భజలాలు పెంపుకు సహకరించాయి. చెరువులు, వాగులు, వంకలు ప్రవహించడంతో నీటిమట్టాలు పెరిగాయి.
● సగటు 9.5 మీటర్లు


