రాయచోటి టౌన్ : తన భర్త మరణంపై తనకు అనుమానం ఉందని కేవీపల్లి మండలం దేవరపల్లికి చెందిన శ్రీదేవి పేర్కొన్నారు. సోమవారం ఆమె జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తాను జీవనోపాధికి కువైట్‌కు వెళ్లానని తెలిపారు. అయితే తాను ఇండియాకు వస్తుండగా మార్గ మధ్యంలో తన భర్త అంజి చనిపోయాడని సమాచారం అందిందన్నారు. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా తనను, తన కుమార్తెను కొట్టి తరిమేశారని వాపోయారు. తన భర్త మరణంపై అనుమానం ఉందని, మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని ఆమె కోరారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
