అర్జీలకు సత్వర పరిష్కారం
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్నవి, సంక్లిష్టమైన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదిక ద్వారా వచ్చే అర్జీని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం వివిధ సమ్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్, జేసీలు స్వీకరించారు.
ప్రజల విజ్ఞప్తులు...
అన్నమయ్య జిల్లా, రాయచోటి టౌన్‌లో నివాసం ఉన్న ఎం చలపతి సతీమణి అనుసూయ, మున్సిపాల్టీలోని 580/1 రాయచోటి గ్రామ పొలంలో సర్వే నంబర్ 581ఏ2సి రెండు నంబర్లపైకి 216 గజాలు భూమి ఉంది. ఈ భూమిని 2014 ఏప్రిల్ 4వ తేదీ న రాయచోటి సబ్ రిజిస్టర్ ఆఫీసులో తన పేరున రిజిస్టర్ అయ్యిందని, తన అనుభవంలో ఉన్న భూమిని ఇద్దరు వ్యక్తులు దౌర్జన్యంగా తన స్థలం ఆక్రమిం ఆక్రమించారన్నారు. వారిని విచారించి స్థలాన్ని తమకు ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. రామాపురం మండలం, గోపగుడిపల్లి గ్రామ పంచాయతీ, కసిరెడ్డిగారిపల్లికి చెందిన మూడే యశోద గ్రామంలో అన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉందని, తమ ఒక్క ఇంటికి మాత్రం లేదని కలెక్టర్‌కు వినతి చేసింది. అధికారులను విద్యుత్ కనెక్షన్‌కోసం సంప్రదిస్తే రూ. 38843 కడితే కనెక్షన్ కల్పిస్తామని తెలిపారన్నారు. తాను పేదరాలినని ఇంత డబ్బుకట్టలేమని తమరు తమ పరిస్థితి గమనించి విద్యుత్ సౌకర్యం కల్పించే విధంగా చూడాలని ఆమె కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.


