తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు, ప్రజలు ఆలయాలలో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర, ముక్తేశ్వర, వేములవాడ, శ్రీశైలం, పంచారామక్షేత్రాలు వంటి దేవాలయాల దగ్గర నదుల్లో భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.


