
మృతుడి కుటుంబీకులకు మాజీ మంత్రి పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇటీవల వేణుగోపాల్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన ఆవులవాండ్లపల్లెకు చేరుకొని మృతుడి కుటుంబీకులు ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిలను పరామర్శించారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి నివాసంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్రనాద్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వీవీ.ప్రతాప్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వీవీ.రమణారెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘునాథరెడ్డి, రామచంద్ర, మల్లికార్జునరెడ్డి, రమణారెడ్డి, అన్నారెడ్డి, బుజ్జిరెడ్డి, యువరాజ్‌నాయుడు, చరణ్‌కుమార్‌రెడ్డి, విశ్వశ్వేతనాథ్‌రెడ్డి, శివారెడ్డి, వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.