ఆందోళనలు.. ఆర్తనాదాలు | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలు.. ఆర్తనాదాలు

Aug 26 2025 8:06 AM | Updated on Aug 26 2025 8:06 AM

ఆందోళ

ఆందోళనలు.. ఆర్తనాదాలు

న్యాయం చేయాలి దిక్కుతోచడం లేదు పింఛన్‌ రాదంటున్నారు అన్యాయం చేస్తే ఊరుకోం దివ్యాంగులపై కోపం తగదు చంద్రబాబు

కూటమి సర్కార్‌ పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నుంచి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు., పాలనా వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని, ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న విమర్శలు సర్వత్రా విసిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్‌పై గ్రామగ్రామాన ప్రజలు రగిలిపోతున్నారు.తాము అధికారంలోకి వస్తే పెన్షన్‌ పెంచుతామన్న చంద్రబాబు ఇప్పుడు అంధులు,, దివ్యాంగులు ఆర్తనాదాలు పెట్టేలా చేస్తున్నారు.

చంద్రబాబూ మాపై ఎందుకు కక్ష

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట

నినదించిన దివ్యాంగులు.

కలెక్టర్‌కు వినతుల సమర్పణ

నా పేరు లక్ష్మీ లావణ్య. కలకడ కోన. 2020 నుంచి పె న్షన్‌ వస్తోంది. వికలత్వ ప ర్సెంటేజ్‌ 73 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు నేను అనర్హురాలునని చెబుతున్నారు. ఇన్ని రోజులు ఉన్న వికలత్వం ఇప్పుడు ఎలా పోయిందో అధికారులే చెప్పాలి. న్యాయం చేయాలి

నా పేరు శివ. 2015 నుంచి పెన్షన్‌ వస్తోంది. నా వికల త్వం పర్సెంటేజీ 64 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు పర్సెంటేజీ తగ్గించారు. ఫింఛన్‌ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాను. ఫెన్షన్‌ రాదని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ చేయాలి. పరిశీలన చేసే డాక్టర్లను విచారించి మాకు న్యాయం చేయాలి.

నా పేరు గున్నామంతి బాలాజీ. నాకు 87 శాతం వికలత్వం ఉంది. ఒకరి సాయం లేకుండా నడవలేను. అందుకే నాకు రూ.200 పించన్‌ ఇస్తున్నప్పటి నుంచి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు రూ.6వేలు వచ్చేది. అదే జీవనాధారం. అలాంటిది ఇప్పుడు నేను వికలాంగుడిని కాదంట.. పెన్షన్‌ రాదని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా తొలగించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెరిఫికేషన్‌ పేరుతో ఉన్న వాటిని తొలగిస్తున్నారు. అర్హత ఉంటేనే ఇన్ని రోజులు ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు పరిశీలన పేరుతో తొలగించడం సరికాదు.

జేసీ ఆదర్శ్‌రాజేంద్రన్‌కు వినతి పరత్రం అందజేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగుల జేఏసీ నాయకులు

రాయచోటి టౌన్‌ : అయ్యా చంద్రబాబూ మాపై కోపం ఎందుకంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ దివ్యాంగుల సంఘం నాయకులు, వికలాంగులు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం దివ్యాంగుల జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో పర్సెంటేజీ లను తగ్గించి, ఉన్న పెన్షన్లను తొలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు కలెక్టరేట్‌ ఎదురుగా రెండు గంటలకు పైగా ఆందోళనను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. అర్హత లేని వారిని తొలగించినా ఫర్వాలేదు కానీ, అర్హత ఉండి రాజకీయాల పేరుతో పెన్షన్లను తొలగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ గోడు వినేందుకు కలెక్టర్‌ తమ దగ్గరకు రావాలని దివ్యాంగులు పట్టుబట్టారు. ఫిర్యాదుల స్వీకరణ తరువాత కలెక్టర్‌ దివ్యాంగులను తన దగ్గరకు పలిపించుకొని వారి వినతులను స్వీకరించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌కు కూడా వినతిపత్రం అందజేశారు.

దివ్యాంగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులని అనిపించకపోవడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చింది. పరిశీలన పేరుతో వికలాంగులను వేధించడం మానుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల దివ్యాంగుల సంఘాల నాయకులతో ఆందోళనలు చేపడతాం.

– ఖలీల్‌, వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం సుండుపల్లె అధ్యక్షుడు

చంద్రబాబు మోసపూరిత మాటలతో దివ్యాంగు ల ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఆయన అసలు రూపం చూపిస్తున్నాడు. పరిశీలన పేరుతో ఉన్న పెన్షన్లను తొలిగించడం ఎంత వరకు న్యాయం.. ఇప్పటికే నాలుగైదు లక్షల మందికి పెన్షన్లను తొలిగించారు. ఇంకా తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారం వచ్చాక మరో మాట మాట్లాడటం చంద్రబాబుకు మామూలే అని మరోసారి నిరూపితమైంది.

– రహెమాన్‌ ఖాన్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ సెక్రటరీ

ఆందోళనలు.. ఆర్తనాదాలు1
1/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

ఆందోళనలు.. ఆర్తనాదాలు2
2/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

ఆందోళనలు.. ఆర్తనాదాలు3
3/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

ఆందోళనలు.. ఆర్తనాదాలు4
4/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

ఆందోళనలు.. ఆర్తనాదాలు5
5/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

ఆందోళనలు.. ఆర్తనాదాలు6
6/6

ఆందోళనలు.. ఆర్తనాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement